సంగారెడ్డి జోన్: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యంతో పాటు నేర దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాల సేకరణ, నాణ్యమైన దర్యాప్తు ఎంతో కీలకమని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా స్థాయి మూడో పోలీస్ డ్యూటీ మీట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి రోజు జాగిలాల ట్రాకింగ్, బాంబు డిస్పోజల్ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... పోలీసుల ప్రతిభను వెలికి తీసేందుకే పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు అందజేయడంతో పాటు, జోనల్ స్థాయిలో నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనేందుకు ఎంపిక చేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ పరితోష్ పంకజ్


