ఇస్రో విజ్ఞానం అద్భుతం | - | Sakshi
Sakshi News home page

ఇస్రో విజ్ఞానం అద్భుతం

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాకు చెందిన 65 మంది భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీశ్‌దావన్‌ స్పేస్‌ సెంటర్‌ను సందర్శించారు. శాస్త్ర విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసి విద్యార్థులకు సమర్థవంతంగా బోధించాలనే లక్ష్యంతో ఇస్రోను జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఉపాధ్యాయులు మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ ప్రయోగ వేదికలను, రాకెట్ల అసెంబ్లీ తయారీ ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల నిర్వహణ, ప్రయోగానికి ముందు చేపట్టే భద్రతా చర్యలు, ప్రయోగానంతర విశ్లేషణ వంటి అంశాలపై శాస్త్రవేత్తలు సమగ్రంగా అవగాహన కల్పించారన్నారు. ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్త ఉపేందర్‌ రాకెట్‌ ప్రయోగానికి ముందు నిర్వహించే ప్రతి దశనూ, ప్రయోగ సమయంలో మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ పాత్రను, ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే విధానాన్ని, రాకెట్‌ నిర్మాణంలో ఉపయోగించే ఆధునిక సాంకేతికతను సవివరంగా వివరించారని చెప్పారు. ఇస్రోలో పొందిన అనుభవాలను జిల్లాలోని విద్యార్థులతో పంచుకొని వారిలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ పర్యటన విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో మరింత మంది యువ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తాం

65మంది భౌతికశాస్త్రఉపాధ్యాయుల సందర్శన

బోధనకు దోహదపడనున్న సాంకేతికత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement