పనిచేసే పాఠశాలలోనే కూతురిని చేర్పించి.. | - | Sakshi
Sakshi News home page

పనిచేసే పాఠశాలలోనే కూతురిని చేర్పించి..

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

ఆదర్శంగా నిలిచినప్రభుత్వ మోడల్‌ స్కూలు ప్రిన్సిపాల్‌

కొండపాక(గజ్వేల్‌): మండల మోడల్‌ స్కూలులో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న నాగార్జున అదే బడిలో తన కూతురును చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ప్రైవేటు స్కూలు కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధన జరుగుతున్నదని నమ్మకం కలిగేలా అతడు పని చేస్తున్న పాఠశాలలో తన కూతురు హరిణిని చేర్పించి, మండల విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి నుంచి బుధవారం అడ్మిషన్‌ తీసుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన, రుచికరమైన భోజనం, ఉచితంగా నోట్‌ బుక్కులు ఇస్తారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు పంపుతూ అదనపు భారాన్ని నెత్తిన వేసుకోవడం తప్పా మరొకటిలేదన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. గ్రామంలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు నాయకులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూ బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్‌ పనితీరుకు ఎంఈఓ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement