నర్సాపూర్: ఆర్టీసీ బస్సులో జరిగిన సీటు పంచాయితీ చిలికి చిలికి గాలి వానై చివరకు బస్సు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు దారి తీసింది. బుధవారం మెదక్ నుంచి సికింద్రాబాద్ బయలు దేరిన ఆర్టీసీ బస్సు నర్సాపూర్ బస్టాండుకు రాగానే వినోద్ అనే దివ్యాంగుడు బస్సుఎక్కాడు. తనకు సీటు ఇవ్వాలని ఓ ప్రయాణికురాలిని అడగ్గా ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఆమె బ్యాగు పాడైంది. వారిద్దరి మధ్య గొడవ మరింత పెరగడంతో తోటి ప్రయాణికులు నచ్చజెప్పినా వినకపోవడంతో డ్రైవర్ బస్సును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ప్రయాణికులిద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడానికి సిద్ధం కావడంతో ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి జోక్యం చేసుకుని నచ్చజెప్పి బస్సును పంపించారు. కాగా బస్సులో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు సమయం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ మరో బస్సులో వెళ్లేందుకు బస్టాండుకు వెళ్లిపోయారు.
ఇబ్బంది పడిన విద్యార్థులు, ఉద్యోగులు


