తప్పిపోయిన చిన్నారి తల్లిచెంతకు.. | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన చిన్నారి తల్లిచెంతకు..

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

వట్‌పల్లి(అందోల్‌): తప్పిపోయిన చిన్నారిని గంటలోపే కనుగొని పోలీసులు తల్లిచెంతకు చేర్చారు. వివరాలు ఇలా... మండల కేంద్రమైన వట్‌పల్లిలో సాయంత్రం ఓ మూడేళ్ల వయస్సున్న చిన్నారి ఏడ్చుకుంటూ రోడ్డుపై తిరుగుతూ కనిపించడంతో స్థానిక పోలీసులు చేరదీశారు. చిన్నారి సరిగ్గా మాట్లాడకపోవడంపై తల్లిదండ్రుల పేర్లు తెలియలేదు. దీంతో చిన్నారి ఫొటోను స్థానిక వాట్సాప్‌ గ్రూపులలో షేర్‌ చేయడంతో పాటు పోలీసులు స్థానికుల వద్దకు చేరుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో జీవనోపాధి కోసం వలస వచ్చిన ఓ మహిళ అప్పటికే తన కూతురు కోసం వెతుకుతుంది. పోలీసుల వద్ద ఉందని తెలుసుకొని స్టేషన్‌కు చేరుకొని చిన్నారిని గుర్తించి నా కూతురేనని చెప్పింది. దీంతో పోలీసులు చిన్నారిని తల్లికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్రీహరితో పాటు పోలీస్‌ సిబ్బందికి చిన్నారి తల్లి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement