మంత్రి వివేక్‌ను కోరిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల కోసం పెండింగ్‌లో ఉన్న నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్‌ను కోరారు. ఈ మేరకు మంత్రి వివేక్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి నిధులు మంజూ రు చేస్తానని హామీనిచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
నేడు చెక్కుల పంపిణీ
ఖేడ్ మండలం జూకల్ శివారులోని కన్వెన్షన్ హాల్‌లో గురువారం ఉదయం 11 గంటలకు ఖేడ్, మనూరు, నాగల్‌గిద్ద, నిజాంపేట మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
రేపు జాబ్‌మేళా
సంగారెడ్డి టౌన్: జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి నిర్మల బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ కంపెనీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పదవ తరగతి ఆపై చదువుకున్న నిరుద్యోగులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉ.11.00 గంటలకు హాజరుకావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
సాధికారతే పురోగతికి పునాది
పటాన్‌చెరు: మహిళా సాధికారతే సమాజ పురోగతికి పునాదిరాళ్లని పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లావణ్య పేర్కొన్నారు. పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాలలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటు నేటి తరం మహిళగా నిలుస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని బుధవారం పటాన్‌చెరు పట్టణంలో పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో లావణ్య మాట్లాడుతూ...చేనేత రంగంలో చేనేత మహిళల కృషి సంప్రదాయానికి అద్దం పడుతుందన్నారు. చేనేత మహిళలకు ప్రభుత్వం అవసరమైన మద్దతు, శిక్షణ, మార్కెట్ అవకాశాలు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతారని వివరించారు. శ్రమకు తగ్గ గౌరవం ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతన్నారు.


