అసైన్డ్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలు

Mar 12 2026 9:11 AM | Updated on Mar 12 2026 9:11 AM

ప్రహరీ పలకలను తొలగించిన రెవెన్యూ అధికారులు

ప్రహరీ పలకలను తొలగించిన రెవెన్యూ అధికారులు

హత్నూర(సంగారెడ్డి): అసైన్‌మెంట్‌ భూముల్లో కొందరు నాయకులు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు బుధవారం ఏర్పాటు చేసిన బౌండరీ పలకలను తొలగించారు. డిప్యూటీ తహసీల్దార్‌ కరుణాకర్‌రావు, ఆర్‌ఐ రాహుల్‌ జీపీఓలు సత్యనారాయణ, సాయికుమార్‌గౌడ్‌, ఘటనా స్థలానికి చేరుకుని అక్రమంగా ఏర్పాటు చేసిన సరిహద్దు పలకలను కొంతమేర తొలగించారు. బడుగు బలహీన వర్గాలు, దళితులకు కేటాయించిన అసైన్డ్‌ భూముల్లో బోరు వేసి దర్జాగా సమీప పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కోసం నిర్మిస్తున్న గృహాలను తొలగించారు. అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా నిర్మించినా, బోర్లు వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్‌ కరుణాకర్‌రావు హెచ్చరించారు. రాజకీయ నాయకులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఇసుక, మట్టి రవాణ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ముచ్చర్ల గ్రామ శివారు అసైన్డ్‌ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

భూములను కాపాడాలి

ముచ్చర్ల గ్రామ శివారులో పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములను కాపాడాలని స్థానికులు కోరారు. కొందరు అక్రమార్కులు రాజకీయ నాయకులు అసెంబ్లీ భూముల్లో అక్రమంగా భవనాలు నిర్మించి స్థానిక పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు అద్దెకిస్తూ అక్రమార్గంగా డబ్బులు సంపాదిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement