దేశవ్యాప్తంగా 108 విగ్రహాల ఏర్పాటు
ఝరాసంగం(జహీరాబాద్): దేశవ్యాప్తంగా జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహాలు 108 ఏర్పాటు చేయనున్నట్లు బర్దీపూర్ ఆశ్రమ పీఠాధిపతి 108 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహరాజ్ వెల్లడించారు. విగ్రహాల ఆవిష్కరణకు సంబంధించి గోడపత్రికను బర్దీపూర్ దత్తగిరి మహరాజ్ ఆశ్రమ ఆవరణలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ..ఆశ్రమ ఆవరణలో ఈనెల ఐదున నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రమంత్రి దామోదర రాజనర్సింహ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాతశ్రీ అనసూయ మాత, గ్రామ సర్పంచ్ రాజు, కేతకీ ఆలయ మాజీ చైర్మన్ ఎన్.వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
నీటి వృథాను అరికట్టండి
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధిలోని చెట్ల చెట్లపోతారం వాటర్ ప్లాంట్ వద్ద పైపులైన్ లీకేజీ కావడంతో నీరు వృథాగా పోతుంది. దీన్ని అరికట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 15 రోజులు గడుస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికై నా రానున్న వేసవికాలంపై దృష్టి సారించి చర్యలు చేపట్టి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
పదో తరగతి
విద్యార్థులకు వీడ్కోలు
మునిపల్లి(అందోల్): మునిపల్లి ఎస్సీ బాలుర వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తోటి విద్యార్థులు వీడ్కోలు పలికారు. హాస్టల్‌లో పదవ తరగతి వరకు చదివిన విద్యార్థులు సహ విద్యార్థులు ఫేర్‌వెల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ రామప్పను విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు. నాణ్యమైన భోజనం అందించడంతోపాటుగా సబ్జెక్టులకు సంబంధించిన సందేహాలను అర్థమయ్యే విధంగా బోధించినట్లు విద్యార్థులు తెలిపారు.
బారికేడ్ల వితరణ
రామచంద్రాపురం (పటాన్‌చెరు): తెల్లాపూర్ నైబర్‌హూడ్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఆదివారం అంకుర ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్ పోలీసులకు బారికేడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు, అంకురా ఆస్పత్రి డైరెక్టర్ డా.నవీన్, తెల్లాపూర్ నైబర్‌హూడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు.
ఏడోవారం..
పోటెత్తిన భక్తజనం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న నామస్మరణతో కొమురవెల్లి మార్మోగింది. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. వేకువజామునుంచే పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామివారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. అనంతరం గంగిరేణు చెట్టువద్ద పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించారు.
దేశవ్యాప్తంగా 108 విగ్రహాల ఏర్పాటు
దేశవ్యాప్తంగా 108 విగ్రహాల ఏర్పాటు
దేశవ్యాప్తంగా 108 విగ్రహాల ఏర్పాటు
దేశవ్యాప్తంగా 108 విగ్రహాల ఏర్పాటు


