మల్లన్న ఆశీస్సులు అందిరిపై ఉండాలి
పటాన్‌చెరు టౌన్: మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని ఘనపూర్ లో ఆదివారం నిర్వహించిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం, జాతర మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కాశిరెడ్డి, రాజ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నూతన దేవాలయాల నిర్మాణాలకు సహకారం
పటాన్‌చెరు: నూతన కాలనీలో దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ముత్తంగి డివిజన్ పోచారం పరిధిలోని మహిధర లగ్జూరియా కాలనీలో పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తలారి భిక్షపతి, కోడూరి భిక్షపతి, కాలనీ అధ్యక్షుడు స్వాతి, వైస్ ప్రెసిడెంట్ సురేంద్ర, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి


