విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి
జహీరాబాద్ టౌన్: విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బర్దీపూర్ ఆశ్రమ పీఠాధిపతి, అవధూత దత్తగిరి మహారాజ్ తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేటు హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల జీవితంలో సవాళ్లకు సిద్ధం చేయడంలో విద్య కీలక పాత్రపోషిస్తుందన్నారు. విద్యతోపాటు క్రీడలు, కళలను పెంపొందించుకోవాలని సూచించారు. మండల విద్యాధికారి మాణయ్య మాట్లాడుతూ..నారాయణ స్కూల్‌లో చదువుతోపాటు ఇతర అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ప్రిన్సిపాల్ శ్రీశైలం పాఠశాల వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆట పాటలు ఆకట్టుకున్నాయి.
విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి


