శాకాహారంతోనే ఆరోగ్యం
జహీరాబాద్: శాకాహారం తీసుకోవడంతోపాటు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ (పీఎస్‌ఎస్‌ఎం) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు సతీశ్‌బాబు తెలిపారు. జహీరాబాద్ పట్టణంలో పీఎస్‌ఎస్‌ఎం ఆధ్వర్యంలో ఆదివారం శాకాహారం ప్రాధాన్యతను చాటిచెప్పే ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం షెట్కార్ ఫంక్షన్‌హాల్‌లో ధాన్యం చేశారు. ఈ సందర్భంగా సతీశ్‌బాబు మాట్లాడుతూ...ధ్యానులు శాకాహారులు కావాలని సూచించారు. జీవహింస మహాపాపమని, మాంసం తినడం వల్ల ఎన్నో అనర్థాలున్నాయని వివరించారు. జీవుల పట్ల కరుణ, దయ, ప్రేమ చూపించాలని సూచించారు. ప్రపంచ పిరమిడ్ ధ్యానకేంద్ర వ్యవస్థాపకులు బ్రహ్మరుషి సుభాష్ పత్రి ఆశయ సాధన కోసం సంస్థ సభ్యులు పనిచేస్తున్నారని తెలిపారు. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మీన, స్వప్న, పరమేశ్వర్, శ్రీనివాస్, కృష్ణయ్య, ధనలక్ష్మి, గాంధీ, సుజాత, వంశీకృష్ణ, మల్లికార్జున్, వెంకటలక్ష్మి తదితరలు పాల్గొన్నారు.
పీఎస్‌ఎస్‌ఎం ప్రతినిధి సతీశ్‌బాబు


