ఇంద్రేశంను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం | - | Sakshi
Sakshi News home page

ఇంద్రేశంను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

Feb 25 2026 11:36 AM | Updated on Feb 25 2026 11:36 AM

ఇంద్రేశంను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

ఇంద్రేశంను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

పటాన్‌చెరు టౌన్‌: కొత్తగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని సమిష్టి సహకారం, సమన్వయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఇంద్రేశం మున్సిపల్‌ పరిధిలోని రామేశ్వరం బండ వార్డు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన తొలి పాలకవర్గ సమావేశానికి ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, కౌన్సి లర్లకు ఉండే అధికారం, బాధ్యతలను తెలుసుకుని ప్రజలకు న్యాయం చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ..రాబోయే ఐదేళ్లపాటు ప్రతీ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఇంద్రేశం మున్సిపల్‌ అభివృద్ధికి ఇప్పటికే రూ.15 కోట్లు మంజూరయ్యాయని త్వరలోనే వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సీఎస్‌ఆర్‌ ఫండ్‌ను కూడా అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్త శుద్ధితో పని చేయాలన్నారు.

ఎంపీ రఘునందన్‌రావు

తొలి పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న

ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement