దిష్టిబొమ్మల దహనం సరికాదు | - | Sakshi
Sakshi News home page

దిష్టిబొమ్మల దహనం సరికాదు

Feb 25 2026 11:36 AM | Updated on Feb 25 2026 11:36 AM

దిష్టిబొమ్మల దహనం సరికాదు

దిష్టిబొమ్మల దహనం సరికాదు

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఇస్నాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఒక బీసీ మహిళకే మద్దతు పలికారని కానీ కొంతమంది దీనిని రాజకీయం చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేయడం సరికాదని ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.సత్యనారాయణ పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇస్నాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా నీలం మధు వ్యవరించిన తీరు సరైంది కాదన్నారు. అన్ని పదవులు తనకు, తన కుటుంబానికే చెందాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. పదవి రానంత మాత్రన బీసీల పేరుతో స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. నీలం మధు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో బీసీ నాయకులంతా ఆయన వెంటనే ఉన్నారని గుర్తు చేశారు. బీసీ కులస్తులందరూ ఐక్యంగా ఉంటే యాభై శాతం రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యపడుతుందని తెలిపారు.

ఎంపీ, ఎమ్మెల్యేలు మద్దతిచ్చింది

ఒక బీసీ బిడ్డకే

ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం

అధ్యక్షుడు సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement