పేదలకు ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

Feb 25 2026 11:36 AM | Updated on Feb 25 2026 11:36 AM

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

జోగిపేట(అందోల్‌): జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ చిట్టిబాబు ముదిరాజ్‌ హమీ ఇచ్చారు. 12వ వార్డులో కౌన్సిలర్‌ సరస్వతితో కలిసి పర్యటించారు. వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని పారిశుద్ధ్య సమస్య, వీధి దీపాల మరమ్మతు, కరెంట్‌ స్తంభాల ఏర్పాటు సమస్యను చైర్మన్‌ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. డాకూర్‌ రోడ్‌ నుంచి రాజరాజేశ్వర మందిరం వరకు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీరోడ్‌, వార్డులోని ముఖ్య సమస్యగా ఉన్న కందకం పైన సీసీ రోడ్‌ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని సూచించారు. మాజీ కౌన్సిలర్‌ సురేందర్‌గౌడ్‌, పట్లోల్ల ప్రవీణ్‌, నాగరాజ్‌ నాయకులు శ్రీనివాస్‌, దుర్గేశ్‌, మల్లేశం, భీమ్‌రాజ్‌, కడల మల్లేశం, సయ్య కార్తీక్‌, అల్లే రాకేశ్‌ మున్సిపల్‌ అధికారులు నాగులపల్లి అంజయ్య, మహేందర్‌, వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి,

వైస్‌ చైర్మన్‌ చిట్టిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement