లైంగికదాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్
సిద్దిపేటకమాన్: వివాహితపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఏసీపీ రవీందర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు వివరాల ప్రకారం... ఈ నెల 19న పట్టణానికి చెందిన మహిళ సరుకులు కొనుగోలు చేయడానికి కిరాణ దుకాణానికి వెళ్లింది. ఆ షాపు యజమాని సాదుల్లా సాయిప్రతాప్ సదరు మహిళను షాపులోపలికి లాక్కెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికదాడికి యత్నించాడు. ఈ విషయాన్ని ఎవరికై నా చెబితే చంపుతానని ఆ మహిళను బెదిరించాడు. అక్కడి నుంచి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన భర్తకు తెలిపింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. బాధిత మహిళ వాంగ్మూలాన్ని భరోసా సెంటర్‌లో నమోదు చేయించి, మహిళను గాయపర్చి, లైంగికదాడికి యత్నించిన నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న మహిళను బీఆర్‌ఎస్ మహిళా కౌన్సిలర్లు, కాంగ్రెస్ మహిళా విభాగం ప్రతినిధులు పరామర్శించారు. కాగా ఈ ఘటనతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.


