జాతీయస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక
గజ్వేల్‌రూరల్: వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థిని జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్(కానిస్టేబుల్) సంతోష్ పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణానికి చెందిన పి.జయహాసిని ప్రజ్ఞాపూర్‌లోని సేయింట్ మేరీస్ విద్యానికేతన్‌లో 9వ తరగతి చదువుతుంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని కమ్మర్‌పల్లిలో జరిగిన సబ్‌జూనియర్ వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటింద న్నారు. ఈనెల 24 నుంచి 28వరకు పశ్చిమబెంగాల్‌లోని హుబ్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు సాయిరాం, రవీందర్‌రెడ్డి, పరంజ్యోతి, రవీందర్, వెంకటేశ్వర్లు, కృష్ణకు కోచ్ సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు.


