ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
చేగుంట(తూప్రాన్): ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. సోమవారం యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కరాజీపేట ఉన్నత పాఠశాలలో శ్రీకాంత్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు, ఉచిత హెల్త్ కార్డుల పంపిణీ, డీఏ బకాయిలు చెల్లించాలని సంఘం తరపున పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. పాతపెన్షన్ విధానం వచ్చేవరకు సంఘం తరపున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు దేవయ్య, జిల్లా కోశాధికారి చంద్రం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


