బైక్ దగ్ధం
శివ్వంపేట(నర్సాపూర్): ఇంటి ముందు పార్క్ చేసిన బైకుని గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని గోమారంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీశైలం తన బైక్‌ని రోజు మాదిరిగా ఇంటి ముందు పార్క్ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. కాగా ఎమ్మెల్యే సునీతారెడ్డి పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీశైలం ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
చిలప్‌చెడ్(నర్సాపూర్): అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను అధికారులు సీజ్ చేశారు. సోమవారం రెవెన్యూ సిబ్బంది మండల పరిధిలోని అజ్జమర్రి, గంగారం, బండపోతుగల్ గ్రామాల్లో మంజీరా వాగు నుంచి అక్రమంగా రవాణా చేసి, గ్రామాల్లో నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసినట్లు తహసీల్దార్ సహదేవ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. సీజ్ చేసిన ఇసుకను త్వరలోనే వేలం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సునీల్‌సింగ్, జీపీఓ రాధాకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
మనోహరాబాద్(తూప్రాన్): సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వ్యక్తులపై దాడి కేసులో ఒకరిని రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ వివరాల ప్రకారం... మండలంలోని లింగారెడ్డిపేట్‌కు చెందిన పెంటాగౌడ్, సుగుణమ్మలపై అదే గ్రామానికి చెందిన సురేశ్‌గౌడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో పెంటాగౌడ్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో సురేశ్‌గౌడ్‌ను సోమ వారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
సిద్దిపేటఅర్బన్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి కోర్టు సాధారణ జైలు శిక్ష విధించినట్టు సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. పొన్నాల గ్రామానికి చెందిన పిల్లిట్ల కమలాకర్ (30) మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడగా సోమవారం సిద్దిపేట కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 5 రోజుల జైలు శిక్ష విధించారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.
15 తులాల బంగారం స్వాధీనం?
జోగిపేట(అందోల్): చోరీ కేసులో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వివరాలు ఇలా... ఈనెల 19న అల్లాదుర్గానికి చెందిన చెగురి లక్ష్మిదేవి సంగారెడ్డిలో బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి వెళ్తూ... జోగిపేటలో వారి బంధువులను తీసుకువెళ్లేందుకు బస్సు దిగింది. తిరిగి మెదక్ డిపోకు చెందిన బస్సులో సంగారెడ్డి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా బంగారు ఆభరణాలున్న ఆమె పర్సు చోరీకి గురైంది. ఐడీ పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా చోరీ చేసిన మహిళను గుర్తించారు. మెదక్ సమీపంలోని ఘనపూర్ గ్రామంలో అనుమవ్వగా తెలుసుకొని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆమె వద్ద 15 తులాల బంగారు నగలు, రూ.7వేలను స్వాధీనం చేసుకున్నారు.
బైక్ దగ్ధం


