చిరుత సంచారం
● రైతులు అప్రమత్తంగా ఉండాలి ● బీట్ ఆఫీసర్ దేవేందర్‌రెడ్డి
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని చిరుతపులి సంచరిస్తున్నట్లు కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.మండలంలోని కేశనాయక్‌తండా పంచాయతీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. పులువురు రైతులు ఇచ్చిన సమాచరం మేరకు ఫారెస్టు బీట్ ఆఫీసర్ దేవేందర్‌రెడ్డి గురువారం ఆయా ప్రాంతాలను సందర్శించారు. పులి పాదముద్రల కోసం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ స్పష్టమైన పాదముద్రలు కనిపించలేదని, కానీ రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో పొలాలు, బావుల వద్దకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని చెప్పారు. కేశనాయక్‌తండా, గుబ్బడి, కుందనవానిపల్లి, బంజారాహిల్స్, గౌరవెల్లి, మైసమ్మవాగుతండాల పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. చిరుత కనిపించినా లేదా అనుమానాస్పద కదలికలు గమనించినా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


