నోటిఫికేషన్
(సీట్లు) (సీట్లు)
1319 సీట్ల భర్తీకి
● మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు ● దరఖాస్తు సమర్పణకుగడువు జనవరి 31 ● జిల్లా వ్యాప్తంగా 24 గురుకులపాఠశాలలు
సంగారెడ్డి క్రైమ్: ప్రభుత్వ మైనార్టీ గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ ఏడాదిలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ గురుకుల విద్యాలయంలో ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి గడువును జనవరి 31వ తేదీ నిర్ణయించింది. అర్హత ఉన్న విద్యార్థులు మీసేవ సెంటర్ లేదా ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అయితే ఒక ఫోన్ నెంబర్‌తో ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలని సూచించింది.
మెనూ ప్రకారం భోజనం
గురుకులాల్లో మెనూ ప్రకారం భోజనం అందించేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అంతేకాదు, వారానికి నాలుగు రోజులు ఎగ్, ఆరు రోజులు పాలు, వారానికి ఒకసారి మటన్, వారానికి రెండు రోజులు చికెన్ అందిస్తుంది. దీంతో పాటు ప్రతిరోజు సాయంత్రం లేదా రాత్రి భోజన సమయాల్లో స్నాక్స్, ప్రతిరోజు ఉదయం టిఫిన్, వారంలో కనీసం నాలుగైదు రకాల ఆకుకూరలతో కూడిన మెనూ ప్రకారం భోజనం అందిస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి
పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. మైనార్టీ విద్యార్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. పదో తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. – భాగ్యమతి,
ఉమ్మడి మెదక్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్
భర్తీ చేయనున్నసీట్లు
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మొత్తం గురుకులాలు 24 ఉండగా.. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ ఏడాదిలో కలిపి మొత్తం 1,319 సీట్లను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మైనార్టీ గురుకులాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత భోజన వసతి, కాస్మోటిక్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా గురుకులాల్లో 5000పైగా విద్యార్థులు పోటీ పడుతున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది కూడా మరింత పోటీ ఉండే అవకాశం ఉందన్నారు.
విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
బాలికలు 262 260
బాలుర 374 423


