
పరిశ్రమల్లో జాగ్రత్తలు తప్పనిసరి
చేగుంట(తూప్రాన్): పరిశ్రమలలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని చిన్నశివునూర్ గ్రామంలోని వెంకటేశ్వర ప్రాడక్ట్ ప్రైవేటు పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమను మొత్తం పరిశీలించారు. కార్మికులకు సేఫ్టీకోసం ఉపయోగించే అన్ని పరికరాలను అందించాలని తెలిపారు. సేఫ్టీ నిబంధనలను పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ నెహ్రూ, పరిశ్రమల నిర్వాహకులు ఉన్నారు.