
రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు
సంగారెడ్డి: 42శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కృష్ణ పేరొన్నారు. బుధవారం సంగారెడ్డిలో మహాసభ వాల్ పోస్టర్‌ను ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీలకు చట్టసభల్లో సరైన రిజర్వేషన్లు అమలు కాలేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల 31న రవీంద్రభారతిలో మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు కులాలకు అతీతంగా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. రిజర్వేషన్లపై అఖిలపక్ష నేతలతో కమిటీ వేసి, 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్ డిమాండ్ చేశారు.
సుంకాన్ని రద్దు చేయాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా స్ఫూర్తితో ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. క్విట్ కార్పోరేట్ అనే నినాదంతో ఏఐటీయూసీ, రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. భారతదేశం, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారనే నెపంతో అమెరికా ఎగుమతి, దిగుమతులపై సుంకం విధించడం హేయమెన చర్యగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, శివశంకర్, మెహబూబ్ ఖాన్, ఖాజా, శివలీల, నర్సమ్మ, మహేశ్, సుజాత, సునీత,పద్మమ్మ పాల్గొన్నారు.
వరి సాగులో
యూరియా తగ్గించాలి
కల్హేర్(నారాయణఖేడ్): వరి సాగులో యూరియా వాడకం తగ్గించాలని ఏడీఏ నూతన్‌కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని మహదేవుపల్లిలో వరి పొలాలను పరిశీలించి, కాంప్లెక్స్ ఎరువులు వాడవద్దని సూచించారు. మొక్క ఎదుగుదల కోసం దుక్కిలో మాత్రమే డీఏపీ లేదా సింగిల్ సూపర్ ఫోస్ఫేట్ మందును వాడాలని సూచించారు. నాలుగు దఫాలుగా యూరియా వాడాలని, ఎక్కువ వాడితే తెగుళ్లు వస్తాయని వివరించారు. పెట్టుబడి తగ్గించుకునేందుకు నానో డీఏపీ, నానో యూరియా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బీబీపేట్ పీఎసీఎస్‌లో ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ వెంకటేశం, రైతులు చంద్రమోహన్, బాలయ్యపాల్గొన్నారు.
వ్యక్తి అదృశ్యం
వర్గల్(గజ్వేల్): డ్యూటీకి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం... గజ్వేల్ సమీప ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ఎర్రవల్లికి చెందిన ముచ్చర్ల కనకరాజు(30) వర్గల్ మండలంలోని సింగాయపల్లిలోని ప్రైవేటు సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం విధులకు వెళ్లాడు. డ్యూటీ ముగిసిన తరువాత ఇంటికి రాలేదు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబీకులు బంధువులు, చుట్టుపక్కల వెతికినప్పటికి ఆచూకీ దొరకలేదు.

రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు

రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు

రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు