
అయినాపూర్ జవాన్ అదృశ్యం
కొమురవెల్లి(సిద్దిపేట): ఓ ఆర్మీ జవాన్ పంజాబ్‌లో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని అయినాపూర్‌లో కలంకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అనిల్ 11 ఏళ్లుగా ఆర్మీలో జవాన్‌గా పంజాబ్‌లోని అంబాల వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. జూలైలో అతనికి ప్రమోషన్ రావడంతో సికింద్రాబాద్‌లోని ఆర్మీ క్యాంపులో ట్రైనింగ్ పూర్తి చేసుకుని సెలవుపై ఇంటికి వచ్చాడు. 18 రోజులు ఉంటివద్ద ఉన్న అతడు ఈనెల 6న పంజాబ్‌లో విధుల్లో చేరేందుకు వెళ్లాడు. 8న తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి కట్ చేశాడు. కుటుంబ సభ్యులు తిరిగి ఫోన్ చేయగా కలువలేదు. దీంతో వెంటనే అక్కడ ఉన్న క్యాంపు ఆర్మీ అఽధికారికి ఫోన్ చేయగా అతడు డ్యూటీలో ఉన్నాడని తెలిపారు. అదే అధికారి తిరిగి ఆరోజు రాత్రి ఫోన్ చేసి మీ అబ్బాయి కనిపించడం లేదని తెలిపాడు. కుటుంబసభ్యులు సీపీ అనురాధను కలిసి సమస్యను విన్నవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని కోరుతున్నారు.
పంజాబ్‌లో ఏడు రోజులుగా
లభించని ఆచూకీ