
జాతీయ భావం పెంపొందించాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మనందరికి రక్ష మన జాతీయ జెండా అని, విద్యార్థులకు చిన్ననాటి నుంచే అవశ్యకతను తెలియచేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఎంపీ ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి అంబేద్కర్ చౌరస్తా వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా ప్రజల్లో జాతీయ భావం పెంపొందించాలన్నారు. భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి అమరవీరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమన్నారు. ఆపరేషన్ సింధూర్‌ను ముందుండి ఇద్దరు మహిళలే నడిపించారన్నారు. ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లో జాతీయత గూర్చి బోధించడం లేదన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రతి ఒక్కరికీ జాతీయత గూర్చి తెలిసే అవకాశం ఉందన్నారు. ఎంపీకి విద్యార్థినులు రాఖీ కట్టగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, పట్టణ అధ్యక్షుడు వెంకట్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
హర్ ఘర్ తిరంగా ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు