
ఖజానాలో చోరీ.. పోలీసుల తనిఖీలు
జహీరాబాద్: హైదరాబాద్‌లోని చందానగర్‌లో గల ఖజానా జ్యూవెలరీ దుకాణంలో మంగళవారం ఉదయం చోరీ జరిగింది. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు జహీరాబాద్‌లో వాహనాల తనిఖీ నిర్వహించారు. డీఎస్పీ సైదా ఆధ్వర్యంలో సీఐ శివలింగం, ఎస్‌ఐలు కాశీనాథ్, వినయ్‌కుమార్, రాజేందర్‌రెడ్డి సిబ్బందితో కలిసి మండలంలోని హుగ్గెల్లి బైపాస్ వద్ద 65వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. దొంగతనానికి పాల్పడిన నిందితులు ముగ్గురు మోటారు సైకిల్‌పై జహీరాబాద్ వైపు పారిపోయారని వచ్చిన సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయినా నిందితుల జాడ దొరకలేదు. మరో మార్గం నుంచి పారిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.