
69 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ
సదాశివపేట(సంగారెడ్డి): 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని ఉజ్వల జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో 69 అడుగుల భారీ జాతీయ జెండాతో పట్టణం ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు చేసిన జాతీయ నినాదాలు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఎస్‌ఐ నాగేష్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే దేశభక్తిని అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో చదువుకుని దేశానికి సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగేష్, వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్‌రెడ్డి, డైరెక్టర్లు రఘువర్ధన్‌రెడ్డి, కరస్పాండెంట్ పోల వెంకటేశం, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.