ఉసురు తీసిన కుటుంబ కలహాలు! | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన కుటుంబ కలహాలు!

Mar 23 2024 8:05 AM | Updated on Mar 23 2024 1:54 PM

- - Sakshi

సంగారెడ్డి: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంసాన్‌పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్చారం ఎస్‌ఐ గౌస్‌ కథనం మేరకు.. సంగముల రాములు (52)కు కుమారుడు మహేశ్‌ ఉన్నాడు. అదే గ్రామంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది నచ్చని తండ్రి మరో అమ్మాయితో వివాహం నిశ్చయించాడు.

ఇది తెలిసిన అమ్మాయి వర్గపు వారు గురువారం రాములు ఇంటికొచ్చి తమ అమ్మాయికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని గొడవ పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాములు శుక్రవారం ఉదయం పాడి గేదెలను తీసుకొని వ్యవసాయ పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు.

ఇవి చదవండి: మూడు రోజుల క్రితం మహిళ హత్య! అడ్డా కూలీలపైనే అనుమానాలు..

Advertisement
 
Advertisement
Advertisement