చేవెళ్ల: సిమెంట్ ట్యాంకర్ ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామానికి చెందిన కొనింటి గౌతమ్ (19), కొనింటి వంశీ (19) వరుసకు సోదరులు అవుతారు. ఇంటర్ వరకు చదువుకున్న వీరు మెకానిక్ పని చేస్తూ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్నారు. చేవెళ్లలోని ఓ బైక్ మెకానిక్షాప్లో గౌతమ్ పనిచేస్తున్నాడు. వంశీ సైతం వేరే చోట పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇద్దరూ కలిసి బైక్పై మోకిలలో స్నేహితుని వద్దకు బయలుదేరారు. దేవునిఎర్రవల్లి బస్స్టేజీ వద్దకు రాగానే సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ ఎలాంటి ఇండికేటర్ వేయకుండా యూ టర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు ట్యాంకర్ ముందు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తలరించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు యువకుల దుర్మరణం


