బ్యాంక్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి

Nov 28 2026 10:29 AM | Updated on Nov 28 2026 10:29 AM

బ్యాంక్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి ● రుణాలు సకాలంలో చెల్లించాలి ● డిపార్ట్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ మానస గంగోత్రి కాట

పూడూరు: బ్యాంకింగ్‌ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని డిపార్ట్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ మానస గంగోత్రి కాట సూచించారు. శుక్రవారం మండలంలోని ఎన్కేపల్లిలో ఆర్థిక సమ్మిళిత సంతృప్త శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. బ్యాంక్‌ ఖాతాలు కొనసాగించడం, సైబర్‌ నేరాలు – డిజిటల్‌ బ్యాంకింగ్‌ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న బీమా, పొదుపు పథకాలు, వ్యవసాయ రుణాలు, ఈ కేవైసీ, నామినీ వివరాల నమోదు గురించి తెలియజేశారు. అనంతరం ఎస్‌బీఐ రాష్ట్ర జనరల్‌ మేనేజర్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో పొదుపు చేసుకోవడం, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సామా జిక భద్రత పథకాలను ప్రోత్సహించడం, బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తేవడం, సురక్షితమైన డిజిటల్‌ బ్యాంకింగ్‌ పద్ధతులపై అవగాహన కల్పించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వ్యాపారులు, రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రుణాలను రీ షెడ్యూల్‌ చేసుకోవాలని సూచించారు. రుణాలను సకాలంలో చెల్లించక పోవడంతోనే వడ్డీ భారం పెరుగుతోందని తెలిపారు. బ్యాంక్‌ అధికారులను మహిళా సంఘాల సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దేవ్‌ప్రియ, టీజీబీ జనరల్‌ మేనేజర్‌ కేవీ కృష్ణశర్మ, సర్పంచ్‌ టీ దయాకర్‌, ఉప సర్పంచ్‌ విజయ్‌కుమార్‌, బ్యాంక్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement