ఆమనగల్లు: జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ జాయింట్ కమిషనర్ చందనా దీప్తి సూచించారు. పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రయాణికులు, డ్రైవర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సీఐ శంకరయ్య, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


