ట్రస్మా సారథిగా అల్లాజీగౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రస్మా సారథిగా అల్లాజీగౌడ్‌

Nov 12 2026 11:36 AM | Updated on Nov 12 2026 11:36 AM

ఆమనగల్లు: రాష్ట్ర గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) జిల్లా అధ్యక్షుడిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన లిటిల్‌స్కాలర్స్‌ టెక్నో స్కూల్స్‌ చైర్మన్‌ చుక్కా అల్లాజీగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, సలహాదారు తల్లోజు వెంకటయ్య, ఉపాధ్యక్షుడు జోసఫ్‌ ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కృష్ణయాదవ్‌(వికాస్‌ హైస్కూల్‌ నందిగామ), కోశాధికారిగా వెంకట్‌రెడ్డి(ఆదర్శ విద్యాలయం, కేశంపేట), ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్‌గౌడ్‌(నవోదయ విద్యాలయం, మాడ్గుల), సంయుక్త కార్యదర్శిగా గంగులు శ్రీనివాస్‌రెడ్డి(అక్షర హైస్కూల్‌, తలకొండపల్లి), రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సుధీర్‌రెడ్డి(అరబిందో హైస్కూల్‌, ఆమనగల్లు), రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా అవ్వారి నిరంజన్‌(రిషి టాలెంట్‌ స్కూల్‌, ఆమనగల్లు), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీరామ్‌(సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌, ఆమనగల్లు)ను ఎన్నుకున్నారు. అనంతరం నూతన జిల్లా అధ్యక్షుడు అల్లాజీగౌడ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం డివిజన్‌ అధ్యక్షుడు అవ్వారి శివలింగం, ప్రధాన కార్యదర్శి చెన్నయ్యగౌడ్‌, సభ్యులు ఆంజనేయులు, వెంకటేశ్‌, వెంకన్న, విష్ణువర్ధన్‌రెడ్డి, బిజు తదితరులు పాల్గొన్నారు.

సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement