అలంకారప్రాయం.. క్రీడా ప్రాంగణాలు అలంకారప్రాయంగా మారాయి. గ్రామీణ యువకులు క్రీడలకు దూరం అవుతున్నారు.
● పంటలు ఎండిపోకుండా జాగ్రత్తలు
● విద్యుత్ శాఖ సీఎండీ జితేష్ వి.పాటిల్
షాద్‌నగర్: ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిందని, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని విద్యుత్ శాఖ సీఎండీ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని రాయికల్, రామే శ్వరం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన, స్థిరమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎన్‌ల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు విద్యుత్, వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు విధిగా పాటించాలని చెప్పారు. భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయని, ఈ నేప థ్యంలో తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుఒకని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరుతడి పంటలు సాగు చేస్తే లాభాలు పొందుతారని అన్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలపైనే ఆధారపడకుండా, స్థానిక వాతావరణ పరిస్థితులు, భూసారం, నీటి లభ్యత, మార్కెట్‌లో డిమాండ్‌ను పరిగణలోకి తీసుకొని పంటలు సాగు చేయాలన్నారు. సజ్జ, జొన్న, రాగి, కంది, పెసర, మినుము, వేరుశనగ తదితర పంటలతో పాటు కూరగాయల పంటలు, పూలు సాగు చేయాలన్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు. వాతావరణంలో మార్పుల కారణంగా వేడిమి అధికమైందని, దీంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. సరఫరాలో ఇబ్బందులు రాకుండా, పంటలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ శివాజీ, షాద్‌నగర్ డీఈ శ్యాంసుందర్‌రెడ్డి, ఏఈ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


