రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు సరికావు | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు సరికావు

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

షాద్‌నగర్‌: రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు సరికావని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్‌గౌడ్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని ఏబీ ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గస్థాయి పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. పార్టీ నాయకులు పట్టభద్రులకు అవగాహన కల్పించి, ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తోందని తెలిపారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, దేపల్లి అశోక్‌గౌడ్‌, కక్కునూరి వెంకటేశ్‌గుప్తా, మనోహర్‌రెడ్డి, కమ్మరి భూపాల్‌చారి, ఇస్నాతి శ్రీనివాస్‌, నర్సింహ, మోహన్‌సింగ్‌, వంశీకృష్ణ, చెట్ల వెంకటేశ్‌, ఉమా మహేశ్వరి, శ్యాంసుందర్‌, బోయ అశోక్‌, రాజ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement