మొయినాబాద్ రూరల్: ఆరోగ్యంపై అవగాహన ఎంతో అవసరమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని ఆరోగ్య గ్రామంలో ఆదివారం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, సినీ, వినోద రంగానికి చెందిన ప్రముఖులు సప్తగిరి, కిరాక్ ఆర్పీ, ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆహారం అంతా కల్తీ అయిపోతోందని, చాలా హోటళ్లు.. రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ఆహారం భుజించడం ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. సంపూర్ణ జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు ఆరోగ్యపు అలవాట్లను మార్చుకోవాలని అన్నారు. నాణ్యతతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా జీవిస్తారన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను ఆరోగ్య గ్రామ నిర్వాహకుడు లక్ష్మణ్ సన్మానించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్


