బషీరాబాద్: చిట్టీ పాట పాడిన తర్వాత సొమ్ము చెల్లించకుండా దుర్భాషలాడుతూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ మంథట్టి గ్రామానికి చెందిన విభూతి పరమేశ్వర్ (30) ఆదివారం బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సంకు మహిపాల్ వద్ద పరమేశ్వర్ రూ.5.10 లక్షల చిట్టీ వేశారు. అవసరం నిమిత్తం సెప్టెంబరు 15న పాట పాడి రూ.4.84 లక్షలకు డిక్లేర్ చేసుకున్నారు. అయితే సొమ్ము చెల్లించకుండా నిర్వాహకుడు తిప్పుతున్నాడని బాధితుడు ఆరోపించారు. అక్టోబరు 16న డబ్బుల కోసం వెళ్లగా.. ఇవ్వనని దూషిస్తూ ఇంటి నుంచి గెంటేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే తరహాలో మరికొందరు చిట్టీ సభ్యులను మోసం చేసినట్లు, మహిపాల్‌పై ఇప్పటికే ధారూరు పీఎస్‌లోనూ కేసు నమోదైనట్లు తెలిపారు. తన సొమ్ము ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విఠల్ తెలిపారు.


