గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

సుభాష్‌నగర్‌: ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన సూరారం పోలీస్‌స్టేషన్‌ పరిధి భగత్‌సింగ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నేపాల్‌కు చెందిన దార్‌ బహదూర్‌ (60)కు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. భార్య నేపాల్‌లో ఉంటుండగా ముగ్గురు కుమారులతో కలిసి భగత్‌సింగ్‌నగర్‌లో నివాసముంటూ దూలపల్లి, జీడిమెట్ల పారిశ్రామికవాడలో లేబర్‌గా పనిచేస్తుంటారు. నెలరోజుల క్రితం బహదూర్‌ పెద్ద కుమారుడు చనిపోగా వీరందరూ నేపాల్‌కు వెళ్లి ఆదివారం సూరారం భగత్‌సింగ్‌నగర్‌కు వచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంట్లో బహదూర్‌ వంట చేస్తుండగా, అప్పటికే గ్యాస్‌ లీకై ఉండడంతో ఒక్కసారిగా సిలిండర్‌ పేలింది. దీంతో బహదూర్‌ తీవ్రంగా గాయపడడంతో పోలీసులు అతన్ని 108 ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి కుమారుడు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గంట వ్యవధిలో పట్టబడ్డ దొంగ

బంజారాహిల్స్‌: మద్యానికి అలవాటుపడ్డ ఓ ఆటోడ్రైవర్‌ తాను అద్దెకు తీసుకున్న ఆటోలోనే స్నాచింగ్‌లకు పాల్పడుతూ బంజారాహిల్స్‌ పోలీసులకు చిక్కాడు. నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. భోజగుట్టలో నివసించే గువ్వా శ్రీను (31) ఆటోను అద్దెకు తీసుకుని బతుకుతున్నాడు. మద్యానికి అలవాటుపడి ఈజీ మనీ కోసం దొంగతనాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–2లోని సాగర్‌ సొసైటీ ముగ్ధా భవన్‌ సెల్లార్‌లో అక్కడి సెక్యూరిటీగార్డ్‌ గోపాల్‌ కళ్లుగప్పి సెల్‌ఫోన్‌ దొంగిలించి ఉడాయించాడు. గంట వ్యవధిలోనే మళ్లీ బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని ఓ ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి యత్నించగా భవన యజమాని గుర్తించి 100కు డయల్‌ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అంతకముందే సెక్యూరిటీగార్డ్‌ సెల్‌ఫోన్‌ దొంగతనం చేసిన మిస్టరీ వీడింది. సెక్యూరిటీగార్డ్‌ సెల్‌ఫోన్‌ దొంగతనం చేసి మరో ఇంట్లో దొంగతనానికి పాల్పడేందుకు స్కెచ్‌ వేసి పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మణికొండ: ప్రజల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించటంతో పాటు వ్యాధిని ముందస్తుగా గుర్తించే ప్రాముఖ్యతను తెలిపే లక్ష్యంతో ఫైనాన్షియల్‌ జిల్లాలోని మెడికవర్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, బైక్‌–ఓ హోలిక్స్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ వారు సైక్లోథాన్‌ నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆసుపత్రి ఆవరణ నుంచి జీటీ రెడ్డి సర్కిల్‌, నానక్‌రాంగూడ సర్కిల్‌, నార్సింగి సర్వీసు రోడ్డు, ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు, విప్రో సర్కిల్‌ మీదుగా 10 కిలోమీటర్ల వరకు కొనసాగింది. పింక్‌ అక్టోబర్‌లో భాగంగా పెడల్‌ ఎగైనెస్ట్‌ క్యాన్సర్‌ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంకాలజిస్టులు డాక్టర్‌ పృథ్వీరాజ్‌, డాక్టర్‌ కవిత, డాక్టర్‌ రవికృష్ణ, మెడికవర్‌ సెంటర్‌ హెడ్స్‌ డాక్టర్‌ సర్వరూప్‌, శరత్‌చంద్రలతో పాటు వైద్యులు, సైక్లింగ్‌ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement