బస్సు కోసం ఎదురు చూస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

బస్సు కోసం ఎదురు చూస్తుండగా..

Oct 26 2026 8:00 AM | Updated on Oct 26 2026 8:00 AM

డీసీఎం ఢీకొని మహిళ మృతి

మొయినాబాద్‌: రోడ్డుపై బస్సు కోసం ఎదురుచూ స్తున్న మహిళను అతివేగం, అజాగ్రత్తగా వస్తున్న ఓ డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన మల్లేశ్‌, చిన్న నాగమణి (50) దంపతులు. ఆదివారం ఉదయం చిన్న నాగమణి తన కూతురు దగ్గరకు వెళ్లేందు కోసం అజీజ్‌నగర్‌ చౌరస్తాలో బస్సు కోసం నిలబడి ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి మొయినాబాద్‌ వైపు అతివేగం, అజాగ్రత్తగా వస్తున్న ఓ డీసీఎం డ్రైవర్‌ ఆమెను బలంగా ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో చిన్న నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఎలక్ట్రీషియన్‌ అదృశ్యం

చేవెళ్ల: ఇంట్లో రాత్రి నిద్రించిన వ్యక్తి ఉదయం లేచే సరికి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌ మండలం పద్మాశాలిపురానికి చెందిన వరకాల నరేశ్‌ (35) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కిత్రం చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన బాలమణితో వివాహం జరిగింది. వివాహానంతరం చేవెళ్లలో కొన్నాళ్లు అద్దె ఇంట్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు ఖాళీ చేసి కౌకుంట్ల గ్రామానికి వచ్చి ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 23న రాత్రి ఇంట్లో పడుకున్న నరేశ్‌ శనివారం తెల్లవారి లేచి చూసే సరికి కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అతని భార్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కులం పేరుతో దూషణ:

కేసు నమోదు

ఇబ్రహీంపట్నం రూరల్‌: కులం పేరుతో దూషించిన వ్యక్తులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆదిభట్ల ఎస్‌ఐ సుందరయ్య కథనం ప్రకారం.. సాహేబ్‌గూడకు చెందిన సాతూరి శ్రీనివాస్‌ ఈ నెల 20న దుర్గమాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేలంపాటలో బంగారు ముక్కుపుడక, చీర దక్కించుకున్నారు. అదే గ్రామానికి చెందిన జూకంటి సురేష్‌గౌడ్‌, జూకంటి మధుసూదన్‌గౌడ్‌ వారిని కులం పేరుతో దూషించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదివారం ఆదిభట్ల పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement