షాబాద్: భూ వివాదం నేపథ్యంలో కత్తితో దాడి చేసిన కేసులో షాబాద్ పోలీసులు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. సీఐ డీకే లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హైతాబాద్ సర్వేనంబర్ 202లోని భూమికి సంబంధించి దీర్ఘకాలిక వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చాంద్‌పాషా, అతని కుమారులు సోహెల్, ఫైజల్‌పై దాడి చేయడానికి నిందితులు ముందస్తు పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్‌పై ఆయుధాలతో అక్కడికి చేరుకుని దాడికి పాల్పడ్డారు. ముజఫర్ ఉద్దీన్ ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం జరిగిన ఘర్షణలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ కేసులో షాబాద్ పోలీసులు శనివారం తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్, రెండు క్రికెట్ బ్యాట్‌లు, కత్తి, పలు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


