ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించిన నలుగురిపై కేసు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించిన నలుగురిపై కేసు

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

పరిగిలో వీధి కుక్కల నియంత్రణ చర్యలు వైభవంగా ఉత్సవాలు త్వరలో ఆసరా పింఛన్లు నిర్మాణాల్లో నిర్లక్ష్యం తగదు

పరిగి: జాతీయ రహదారిపై కారు టాప్‌పై కూర్చుని విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శనివారం పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివరాలతో శనివారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు స్పందించిన ఎస్‌ఐ మోహనకృష్ణ సదరు కారును గుర్తించి సీజ్‌ చేశారు. కారుతో హల్‌చల్‌ చేసి, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

పరిగి: ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లేశ్‌ అన్నారు. పట్టణం వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈమేరకు శనివారం బ్లూ క్రాస్‌ ఆధ్వర్యంలో 170 శునకాలను పట్టించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీధి కుక్కలను పట్టుకుని, వాటి వ్యాప్తి జరగకుండా శస్త్ర చికిత్సలు చేయించి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. మిగిలిన వాటిని కూడా పట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తాండూరు టౌన్‌: పట్టణంలోని సాయిపూర్‌ ప్రసన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి దంపతులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లు బంటు వేణుగోపాల్‌, శ్రీకాంత్‌, పురవాసులు పాల్లొన్నారు.

మర్పల్లి: అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం త్వరలోనే ఆసరా పింఛన్లు అందించనుందని డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ అన్నారు. మండల పరిధిలోని కొంషెట్‌పల్లి, పట్లూర్‌, మర్పల్లి, కొత్లాపూర్‌, సిరిపురంలో ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులపై శనివారం ఎంపీడీఓ శాంత, ఏపీఎం సమ్మయ్యతో కలిసి క్షేత్రస్థాయి విచారణ చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇంకుడు గుంతలు, బోర్‌వెల్‌ స్ట్రక్చర్‌ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏపీఓ అంజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు రఫియొద్దీన్‌, పరశురామ్‌, లక్ష్మి మాధవరెడ్డి, సంగీతకృష్ణారెడ్డి, వార్డు మెంబర్లు ఉన్నారు.

కుల్కచర్ల: మహిళా సమాఖ్య గ్రామ సంఘాల భవనాల నిర్మాణంలో నిర్లక్ష్యం తగదని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ అన్నారు. శనివారం ఆమె చౌడాపూర్‌ మండల కేంద్రంతో పాటు మందిపల్‌లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పను లను పరిశీలించారు. మందిపల్‌లో చేపట్టిన గ్రామ సంఘం భవన నిర్మాణ పూజలో పాల్గొన్నారు. గ్రామ సంఘాలు, పంచాయతీ భవ నాల నిర్మాణాలు, సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు తదితర అభివృద్ధి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆయా భవనాలకు అవసరమైన స్థలాల కోసం తహసీల్దార్లను సంప్రదించాలని సూచించారు. వీబీరాంజీ ద్వారా గ్రామాల్లో వివిధ పనులు నిర్వహించుకునేందుకు అవ కాశం ఉందని, వీటిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎంపీడీఓ వెంకన్న, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఓ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement