అనంతగిరి: వికారాబాద్‌లో చేపట్టిన ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని శాసనసభ స్పీకర్ జి.ప్రసాద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ దీపక్ తివారి, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. గడువులోపు అందుబాటులోకి తేవాలన్నారు. నాణ్యత పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. రవాణాపరంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో ఆస్తులు కోల్పోయిన వారికి వారం రోజుల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వెల్చాల్ చర్చిని పరిశీలించిన స్పీకర్
మోమిన్‌పేట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించిన వెల్చాల్ చర్చిని శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా చర్చిలో కాలిపోయిన ఫర్నిచర్‌ను పరిశీలించారు. అనంతరం కమిటీ సభ్యులతో మాట్లాడారు. నీటి సమస్య పరిష్కారానికి బోరు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీనివాస్, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ శంకర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు సురేందర్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలి
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
కలెక్టర్ దీపక్‌తివారితో కలిసి పనుల పరిశీలన


