తాండూరు రూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను కరన్‌కోట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన తాండూరు మండలం గోనూర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ అన్వేష్ రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాచనూర్ శివకుమార్ కాగ్నా వాగు నుంచి ట్రాక్టర్లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహనాన్ని పీఎస్‌కు తరలించి, యజమాని శివకుమార్‌తో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా ట్రాక్టర్‌ను వదిలిపెట్టాలని అధికార పార్టీ నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. అంతకుముందే గోనూర్‌లో ఓ ట్రాక్టర్ యజమాని పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని చూసి, గ్రామస్తులు విస్తుపోయారు. పోలీసులు అతన్ని జీపులో పీఎస్‌కు తరలించారు.
యజమాని, డ్రైవర్‌పై కేసు


