మొయినాబాద్: అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–2), అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులకు నిర్వహించే పరీక్ష కేంద్రాలను శుక్రవారం చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి పరిశీలించారు. మొయినాబాద్‌లోని కేజీరెడ్డి, గ్లోబల్, వీజేఐటీ, జేబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలు, చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అసిస్టెంట్ సైంటిస్ట్ పరీక్ష శనివారం, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పరీక్ష సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నాయి. ఆయా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కుల్కచర్ల: వీబీజీరాంజీ పనులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ అడిష నల్ పీడీ సత్యయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని సాల్వీడులో ఫారంపాండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల ద్వారా బోర్లలో నీటి లభ్యతను పెంచుకోవచ్చని తెలిపారు. వీబీజీరాంజీ పథకం కింద పశువుల పాకలు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ చంద్రశేఖర్, టీఏ మహేశ్వరి, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.


