నిర్ణీత గడువులోగా ఆలయ నవీకరణ పనులు పూర్తి కావాలి | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత గడువులోగా ఆలయ నవీకరణ పనులు పూర్తి కావాలి

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

కొడంగల్‌: పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీవారి బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్మాణ పనుల తీరును గమనించారు. నిర్ణీత గడువులోపు పూర్తి కావాలని అధికారులకు సూచించారు. కొత్తగా నిర్మిస్తున్న కట్టడాలను గమనించారు. పనుల్లో పురోగతి సాధించాలని, ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారికి సూచించారు. పనుల పురోగతిపై నిరంతరం సమీక్ష నిర్వహించాలన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోకంగా ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్‌, కల్యాణ మండపం, కల్యా ణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, ప్రత్యేక అవసరాల గదులు, పార్కింగ్‌, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి ఆధునాతన వసతులతో చేపట్టాలన్నారు. కొడంగల్‌ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. రూ.110 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆలయ పునర్నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి కావాలన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు వాస్తు నిపుణులతో కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో నారాయణ పేట జిల్లా కలెక్టర్‌ ప్రియాంక, వికారాబాద్‌ ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్లు ఉమాశంకర ప్రసాద్‌, వెంకటాచారి, ఆర్‌డీఓ అనిత, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన

శ్రీవారిని దర్శించుకున్న సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement