● ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
● చింతలపల్లి సమీపంలో ప్రమాదం
ఆమనగల్లు: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తలకొండపల్లి మండలం వెంకటాపూర్ తండాకు చెందిన సబావత్ తరుణ్ తన మామ ఆర్లకుంటతండాకు చెందిన నేనావత్ బిచ్చాతో కలిసి గురువారం రాత్రి మైసిగండి మైసమ్మ దేవస్థానం నుంచి తండాకు వెళ్తున్నాడు. చింతలపల్లి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్ అక్కడికక్కడే మృతిచెందగా బిచ్చాతో పాటు మరో బైక్‌పై ఉన్న తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లికి చెందిన శివ, చందు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెల్దండలోని ఎన్నం ఆస్పత్రికి తరలిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్: ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పిన ఆర్టీసీ అద్దె బస్సు డీసీఎంను ఢీకొట్టింది. ఈ సమయంలో ఆర్టీసీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వస్తున్న మరో రెండు బైక్‌లు బస్సును ఢీకొన్నాయి. చింతపల్లిగూడ గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళతో పాటు బైక్‌పై ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి.
బొంరాస్‌పేట: దుద్యాల మండల వ్యవసాయాధికారిగా సీహెచ్ వినోద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు దౌల్తాబాద్ ఏఓ తులసి ఇన్‌చార్జ్‌గా ఉండగా రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వహిస్తున్న వినోద్ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.
సూపరింటెండెంట్‌గా శ్రీనివాసులు
దుద్యాల మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్‌గా శ్రీనివాసులు గురువారం విధుల్లో చేరారు. ఐదు నెలల క్రితం కుల్కచర్ల మండలానికి బదిలీపై వెళ్లారు. తిరిగి విధుల్లో చేరారు.


