పండగ సీజన్‌లో 120 ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

పండగ సీజన్‌లో 120 ప్రత్యేక రైళ్లు

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్త పరిశుభ్రతా కార్యక్రమం ‘స్పెషల్‌ క్యాంపెయిన్‌ 6.0’లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే గురువారం పలు స్టేషన్లలో ‘రైల్‌ జన్‌ సంవాద్‌’ నిర్వహించింది. చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ పాల్గొని ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భద్రత, పరిశుభ్రత, తాగునీరు, అదనపు రైళ్లపై ప్రయాణికులు ఇచ్చిన సూచనలపై తగిన చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారు. అమృత్‌ భారత్‌ పథకం కింద స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందని, ప్రస్తుత పండుగ సీజన్‌లో 4 లక్షల మందికి పైగా ప్రయాణికుల కోసం 120 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపారు. దీపావళి, సంక్రాంతి, శబరిమల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి వరకు ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అనంతరం ఆయన చర్లపల్లి స్టేషన్‌ వసతులు, అప్రోచ్‌ రోడ్డు పనులను తనిఖీ చేశారు. సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డాక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణన్‌, రైల్‌ నిలయం, సికింద్రాబాద్‌ డివిజన్‌ లకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement