అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

నవాబుపేట: కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండలంలోని గుబ్బడిపత్తేపూర్‌లో మేకల అనూష సుధాకర్‌ పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. పేదలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభు త్వం నెరవేరుస్తోందని తెలిపారు. లబ్ధిదారులు కళ్లల్లో సొంతింటి ఆనందం కనిపిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇళ్లు రానివారు ఆందోళన చెందరాదని, రెండో విడతలో వస్తాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు సామెల్‌, జేయయ్య, పంచాయతీ కార్యదర్శి పాండురంగం, నాయకులు, రాములు, ఇసూబ్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కాలె యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement