పాలపిట్టలకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

పాలపిట్టలకు రక్షణ

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

సాక్షి, సిటీబ్యూరో/రాంగోపాల్‌పేట్‌: దసరా నేపథ్యంలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 8 పాలపిట్టలను నగర పోలీసు విభాగంతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ సొసైటీ ఫర్‌ ద ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టు యానిమల్స్‌ (జీహెచ్‌ఎస్పీసీఏ) ప్రతినిధుల బృందం కాపాడాయి. ప్రజల నుంచి అందిన సమాచారంతో లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకై న బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాలపిట్టలను విడిపించిన అధికారులు కేబీఆర్‌ పార్క్‌ అటవీ అధికారులకు అప్పగించారు. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి నిర్బంధించిన ఒక పాలపిట్టను, మంగళ్‌హాట్‌ బాలాజీనగర్‌ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రెస్క్యూ చేసి ఫారెస్ట్‌ అధికారు లకు అప్పగించారు. అలాగే.. జీహెచ్‌ఎస్పీసీఏ ప్రతినిధులు.. తాడ్‌బండ్‌ హనుమాన్‌ దేవాలయం ప్రాంతంలో రెండు, నాగోల్‌లో ఒకటి, బేగంబజార్‌లో ఒక పాల పిట్టను రక్షించి వైద్య పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. రాష్ట్ర పక్షి పాలపిట్టను హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని కొత్వాల్‌ వీసీ సజ్జనర్‌ హెచ్చరించారు. వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా 180042 55364, 9803338666 లేదా డయల్‌ 112కు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement