కొత్త బోరు బంద్‌! | - | Sakshi
Sakshi News home page

కొత్త బోరు బంద్‌!

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

● భూగర్భ జల పరిరక్షణకు నీరు–భూమి–చెట్టు చట్టం (వాల్టా) పకడ్బందీ అమలుకు యంత్రాంగం సిద్ధమైంది. సొంతంగా బోరు వేసుకోవాలన్నా రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. 400 అడుగుల పరిమితి ఉంది. కానీ, 500–1,500 అడుగుల వరకు తవ్వుతున్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌, భూగర్భ జల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉల్లంఘనులపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది.

తీవ్ర వర్షాభావ పరిస్థితుల రీత్యా సర్కారు కఠిన చర్యలు అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా

సాక్షి, సిటీబ్యూరో: తీవ్ర వర్షాభావం రీత్యా భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. క్యూర్‌ పరిధిలో అపార్టుమెంట్లలోని బోర్లు మొరాయిస్తున్నాయి. వచ్చే రుతుపవనాల వరకు ఉన్న 8 నెలలు అత్యంత కీలకం. దీంతో అధికార యంత్రాంగం నీటి వృథాపై చర్యలకు దిగింది. కొత్త బోర్ల తవ్వకాలపై నిషేధం విధించింది. విషయంలో క్షేత్రస్థాయి తనిఖీలకూ సిద్ధమైంది. నిర్మాణ రంగానికి శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని తప్పనిసరి చేసింది. ఈ ఆంక్షలు తాగునీటికే కాక నిర్మాణాలు, ఇతర అవసరాలకు వర్తిస్తాయి.

రోజుకు 200 పైనే కొత్త బోర్లు

క్యూర్‌లో సుమారు 13 నుంచి 15 లక్షలకు పైగా బోర్లున్నాయని అంచనా. రికార్డుల్లో మాత్రం 2.43 లక్షల బోర్లే. నిబంధనలకు విరుద్ధంగా రోజుకు సగటున 200పైగా కొత్త బోర్ల తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం. రోజుకు 100 బోర్లు ఎండిపోతున్నాయి. కొండాపూర్‌, బంజారాహిల్స్‌, బండ్లగూడ జాగీర్‌ వంటి ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌వాసులు 400 అడుగుల పరిమితిని దాటి తవ్వుతున్నారు. కొన్నిచోట్ల వెయ్యి అడుగులకు మించుతున్నారు. ఫలితంగా భూగర్భ జలాల వినియోగం 102 శాతానికి చేరింది. నేలలోకి చేరుతున్న నీటి కంటే ఎక్కువ తోడేస్తుండడంతో భూగర్భ జల లభ్యత ‘క్రిటికల్‌’గా ఉన్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో క్యూర్‌ పరిధిలో భూగర్భ జలమట్టం కిందికి దిగజారుతున్న నేపథ్యంలో నిర్మాణ రంగ పనుల కోసం కొత్త బోర్లకు అనుమతులు ఇవ్వొద్దు.

– జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement