పెళ్లింట్లో విషాదం | - | Sakshi
Sakshi News home page

పెళ్లింట్లో విషాదం

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

● రోడ్డు ప్రమాదంలో పెళ్లికుమార్తె అక్క దుర్మరణం

● చెల్లెలి పెళ్లయిన రెండు రోజులకే దారుణం

రాజేంద్రనగర్‌: చెల్లెలి పెళ్లయిన రెండు రోజులకే అక్క మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో పెళ్లి కోసం ఒంగోలు నుంచి వచ్చిన మరో యువకుడు తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడ కాళీమందిర్‌ అభ్యుదయ నగర్‌లో పరిశుద్ధరావు తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. పెద్ద కుమార్తె ఐశ్వర్య (25) ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. రెండవ కుమార్తె వివాహం రెండు రోజుల క్రితం జరిగింది. ఈ క్రమంలో ఒంగోలు నుంచి పెళ్లికి వచ్చిన మాథ్యూస్‌(26) తో కలసి మంగళవారం టిఫిన్‌ చేయడానికి కాళీమందిర్‌ వద్దకు బైక్‌పై వచ్చారు. టిఫిన్‌ చేసి తిరిగి అభ్యుదయ నగర్‌ వైపు వెళుతున్నారు. ఓ లారీకి కాళీమందిర్‌ వద్ద పూజలు చేసుకుని కిస్మత్‌పూర్‌ వైపు వెళుతుండగా బైక్‌ నడుపుతున్న మాథ్యూస్‌ లారీని దాటుకుని వెళ్లాలనుకుని అదుపుతప్పి పడిపోయారు. ఈ సంఘటనలో లారీ కింద పడిన ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందింది. మాథ్యూస్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ రాఘవేందర్‌ సంఘటన స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ నడుపుతున్న యువకుడు పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement