మృతదేహంతో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మృతదేహంతో ఆందోళన

Oct 22 2026 6:56 AM | Updated on Oct 22 2026 6:56 AM

మంచాల: వైద్యం వికటించి వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆర్‌ఎంపీ క్లినిక్‌ వద్ద శవంతో ఆందోళన నిర్వహించారు. స్థానికుల కథనం ప్రకారం మండల పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన ఈర్లపల్లి విజయ్‌కుమార్‌(36) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దసరా పండుగ సందర్భంగా చిత్తాపూర్‌ గ్రామంలోని అత్తగారి ఇంటికి వచ్చాడు. బుధవారం ఛాతిలో మంటగా ఉందని చెప్పడంతో బంధువులు అతన్ని బైక్‌పై మంచాలలోని ఓ ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఇంజక్షన్‌ తీసుకుని తిరిగి వెళ్తుండగా సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద విజయ్‌ బైక్‌ పైనుంచి కుప్పకూలిపోయాడు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స చేస్తుండగానే ప్రాణం వదిలాడు. ఆర్‌ఎంపీ వైద్యం వికటించడంతోనే విజయ్‌ చనిపోయాడంటూ ఆగ్రహించిన అతని బంధువులు మృతదేహంతో మంచాలకు వచ్చారు. ఆర్‌ఎంపీ క్లినిక్‌ ఎదటు శవంతో ఆందోళన చేశారు. అప్పటికే వైద్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య దీక్షిత, కూతుళ్లు శ్రీమహంతి, దేవకి ఉన్నారు.

● ఆర్‌ఎంపీ చికిత్సతో వ్యక్తి చనిపోయాడని బంధువుల ఆరోపణ

● మంచాలలోని క్లినిక్‌ ఎదుట ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement